బాబు కోసం సంకెళ్లు.. లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి పిలుపు?
చంద్రబాబు ని అక్రమంగా అరెస్ట్ చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన నియంతృత్వ పోకడలు దేశమంతా తెలియాలని నారా లోకేష్ అంటున్నారు. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించాలని నారా లోకేష్ తెలిపారు. ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నారా లోకేష్ ఇలాంటి ఆందోళనలు గతంలోనూ నిర్వహించారు.