తెలంగాణలో బీజేపీ ఖాయమంటున్న రాజ్‌నాథ్?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ ఎంతో తోడ్పాటు అందించిందన్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తెలంగాణ కోసం నేను జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించామని.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లు రెండు అభివృద్ధి లో దూసుకు పోవాలని కోరుకున్నామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.