ఇవాళ లోకేశ్, పవన్ కీలక భేటీ.. డిసైడ్ చేసేస్తారా?
దీనిపై ఇప్పటికే ఇరు పార్టీలు సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులను ప్రకటించాయి. టీడీపీ నుంచి కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య ఉంటారు. అలాగే జనసేన నుంచి కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్రెడ్డి, కొటికలపూడి గోవిందరావు ఉంటారు. రాజకీయ కార్యక్రమాల వేగం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరు పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి.