ఇవాళ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలకు పిలుపు ఇచ్చింది. దసరా సందర్భంగా మనం చేద్దాం జగనాసుర దహనం పేరుతో కార్యక్రమం నిర్వహించాలని పార్టీ పిలుపు ఇచ్చింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కొత్తగా మరో కార్యక్రమం నిర్వహించబోతోంది. గతంలో చేపట్టిన కార్యక్రమాల తరహాలోనే ఈ నిరసన కూడా ఉంటుంది. దీంట్లో రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాలు మనం చేద్దాం జగనాసుర దహనం పేరుతో నిరసన తెలుపుతారు. ఎక్కడి కక్కడ జగన్ ఫోటోలు, ఫ్లెక్సీలు దహనం చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే టీడీపీ కొన్నాళ్లుగా ప్రతి ఆదివారం ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతోంది. ఒకసారి చేతులు తాళ్లతో కట్టేసుకుని.. ఒకసారి.. కొవ్వొత్తులు వెలిగించి.. మరోసారి ఈలలు వేసి..ఇలా ఏదో ఒక కార్యక్రమం చేపడుతోంది. అయితే ఈ కార్యక్రమాలకు పార్టీ నుంచి తప్ప ప్రజల నుంచి మాత్రం పెద్దగా స్పందన కనిపించట్లేదని విమర్శలు ఉన్నాయి.