ఇవాళ్టి నుంచి నారా భువనేశ్వరి జనంలోకి వెళ్తున్నారు. ఇవాళ అత్తగారి ఊరు నారావారి పల్లెకు చేరుకోనున్న నారా భువనేశ్వరి అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెకు నారా భువనేశ్వరి వెళ్లనున్నారు. ఇక రేపటి నుంచి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట ప్రజల్లోకి వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్టు వల్ల ఆవేదన తో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి నారా భువనేశ్వరి తన పర్యటన ప్రారంభించనున్నారు.
అయితే.. నారా భువనేశ్వరికి ప్రజల్లోకి వెళ్లిన అనుభవం లేదు. ఎన్టీఆర్ కూతురైనా.. చంద్రబాబు భార్య అయినా ఆమె ఎప్పుడు రాజకీయాల్లో లేరు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. చంద్రబాబు అరెస్టయి జైల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఆమె జనంలోకి వెళ్తున్నారు. జనం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.