2035లోగా చంద్రుడిపై ఇండియన్‌ స్పేస్‌ స్టేషన్‌?

Chakravarthi Kalyan
2035 లోగా చంద్రుడు పై స్పేస్ స్టేషన్ నిర్మించాలని సంకల్పంతో భారతదేశం పనిచేస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇస్రో ను చూసి భారతదేశం గర్విస్తుందని.. చంద్రుడిపై సౌత్ పోల్ లో విక్రమ్ ల్యాండర్ ను పంపించిన మొట్టమొదటి దేశం భారతదేశమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో కంటే భారత దేశం సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధించిందన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు.

దేశంలో గడచిన తొమ్మిది సంవత్సరాలలో బ్యాంకింగ్ రంగంలో పేదలకు ఖాతాలు, వెనకబడిన ప్రాంతాలలో సైతం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అందుబాటులోకి వచ్చాయని.. భారతదేశంలో అన్ని గ్రామాలలో విద్యుత్ రంగం, ఇంటర్నెట్ రంగం సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  అన్నారు. మన దేశంలో చిరు వ్యాపారులు సైతం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారని.. ఈరోజు భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో 68 శాతం సాంకేతిక  అభివృద్ధి సాధించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: