జగన్‌పై కేంద్రానికి పురందేశ్వరి కంప్లయింట్‌..?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో వైసీపీ అవినీతి అక్రమాల గురించి సాక్ష్యాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్రానికి కంప్లయింట్ చేశారు. గతంలోనూ ఆమె పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. ఇప్పటికే లిక్కర్ స్కాం, ఇసుక, మైనింగ్ వంటి అంశాలపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు.

కానీ దానిపై ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేదు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో వైసీపీతో బీజేపీకలిసి డ్రామాలాడుతున్నారని అర్థమవుతుందని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్ర ప్రజలకు వైకాపాతో ,భాజాపాకు సంబంధం లేదని చూపించడానికి చేస్తున్నట్లు ఈ వ్యవహారం నడుస్తుందని అంటున్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కాం పై స్పందించిన భాజపా రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతున్న ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడిపిస్తుందని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: