ఎన్నికల ముందు కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ?
దీంతో విపక్షాలు మరోసారి రెచ్చిపోతున్నాయి. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్ము మింగేసి, నాలుగు కోట్ల తెలంగాణ జనం నోట్లో మట్టిగొట్టారని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వారు ధ్వజమెత్తారు. వందేళ్లు పైగా ఉండాల్సిన సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, ఇలా కండ్ల ముందే కొట్టుకుపోవడానికి కారణం కేసీఆరే అంటున్నారు. కేసీఆర్ ఇష్టానుసారం గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు... లక్ష కోట్ల రూపాయల అవినీతి అని ఆరోపించారు.