కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైందా?

Chakravarthi Kalyan
కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైందంటున్నారు తెలంగాణ విపక్ష నేతలు. మేడిగడ్డ కుంగింది.. కేసీఆర్ పాపం పండిందని విమర్శిస్తున్నారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్... ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణానికి  రూ. 38,500 కోట్ల నుంచి రూ.1లక్ష 51 వేల కోట్లకు అంచనాలను పెంచిందని.. నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రేవంత్ రెడ్డి అన్నారు.


పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి .. రీడిజైన్ పేరుతో కేసీఆర్  ప్రాజెక్టుల స్వరూపం పూర్తిగా మార్చేశారని మండిపడ్డారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏదేమైనా సరిగ్గా ఎన్నికల సమయంలో కాళేశ్వరం లోపాలు వెలుగు చూడటం కేసీఆర్‌కు పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: