
ఎలక్షన్వార్: వాళ్లు కేసీఆర్ కొంప కూలుస్తారా?
దాదాపు 16 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. అయినా వీసమెత్తు చర్య లేదు. పైగా దబాయింపు.. రెండో దఫాలో నాలుగేళ్ల నిద్రపోయి.. చివరి ఏడాదిలో అన్ని నోటిఫికేషన్లు కుమ్మరించి.. ఏదీ సరిగ్గా నిర్వహించకుండా లక్షల మంది నిరుద్యోగుల ఉసురు కట్టుకున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యం అంటున్నారు. నిజమే.. కాదనలేం.. కానీ ఉన్న ఉద్యోగాలకైనా సరిగ్గా పరీక్షలు పెట్టాలి కదా.. నియామకాలు జరపాలి కదా. సరిగ్గా పరీక్షలు నిర్వహించడం కూడా చేతకాలేదన్న విమర్శ ఉంది. పోనీ తప్పులు తెలిశాక కూడా చర్యలు తీసుకోలేదన్న ఆవేదన ఉంది. అదే నిరుద్యోగుల కడుపుమండిస్తోంది.
అశోక్‌నగర్‌లో అగ్గి రాజేస్తోంది.