బాబు ఫ్లాష్‌బ్యాక్‌ బయటపెడుతున్న వైసీపీ నేతలు?

Chakravarthi Kalyan
సామాజిక సాధికార యాత్రల్లో వైసీపీ నేతలు చంద్రబాబు ఫ్లాష్ బ్యాక్‌ను గుర్తు చేస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలకు చంద్రబాబు ఏనాడైనా మేలు చేశాడా అని మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా ప్రశ్నించారు. బాబుకు బానిసత్వం చేసేవారే టీడీపీలో మిగిలారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. తోకలు కత్తిరిస్తా, తాట తీస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించారని మంత్రి సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖలు సైతం రాశాడని.. దళితులను అవమానించిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

ఓ మత్స్యకారుడు పార్లమెంట్‌లో అడుగుపెట్టాడంటే అందుకు కారణం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఏపీలో సామాజిక న్యాయం ఏ విధంగా అమలవుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని సీదిరి అప్పలరాజు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక భరోసాను సీఎం వైయస్‌ జగన్‌ కల్పించారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: