దీపావళి బాణసంచాపై నిషేధం.. సుప్రీంకోర్టు షాక్‌?

Chakravarthi Kalyan
దీపావళి వస్తోంది. అంతా టపాసులు రెడీ చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో శబ్ధ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు బాణసంచాపై విధించిన నిషేధం అన్నిరాష్ట్రాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్నిరాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018, 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుచేసేలా రాజస్థాన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది.


బాణసంచాలో బేరియంసహా నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో సుప్రీం కోర్టు  తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలు దిల్లీ సహా దేశమంతటికి వర్తిస్తాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కొత్తగా మళ్లీ ఉత్తర్వులు అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రాజస్థాన్‌ తో పాటు అన్ని రాష్ట్రాలు పండుగల సమయంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: