తనిఖీల్లో కోట్లకు కోట్లు దొరుకుతున్నాయ్‌?

Chakravarthi Kalyan
నెల రోజుల్లోనే తెలంగాణ శాసనసభ ఎన్నికల తనిఖీల్లో స్వాధీనాలు చేసుకున్న మొత్తం విలువ 525 కోట్లు దాటింది. అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు 525 కోట్లా పది లక్షలకు పైగా నగదు, మద్యం, ఆభరణాలు, డ్రగ్స్, ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. గత 24 గంటల్లో ఆరు కోట్లా 20 లక్షలకు పైగా విలువైన సొత్తు పట్టుబడిందని వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు 179 కోట్లా 86 లక్షలకు పైగా నగదు, 31 కోట్లా 14 లక్షలకు పైగా విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామని.. 178 కోట్లా 29 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం అయ్యాయని వికాస్ రాజ్ తెలిపారు. ఇంకా 31 కోట్లా 14 లక్షలకు పైగా విలువైన మాదకద్రవ్యాలు, 66 కోట్లా 61 లక్షలకు పైగా విలువైన ఇతర వస్తువులు, కానుకలను స్వాధీనం చేసుకున్న వికాస్ రాజ్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: