తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు అన్ని స్థానాల టికెట్ల పంపిణీ పూర్తయింది. అయితే.. టికెట్ల కేటాయింపులో రేవంత్ రెడ్డి పప్పులు పెద్దగా ఉడకలేదని తెలుస్తోంది. తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలని ఆయన చేసిన కొన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ముందు పట్టుబట్టి టికెట్లు ఇప్పించుకున్నా.. సీనియర్ల బెదిరింపులు, అలకలతో కొన్ని చోట్ల మార్పులు చేయక తప్పలేదు. పటాన్ చెరులో దామోదర రాజనర్సింహా, సూర్యాపేటలో దామోదర్ రెడ్డి వంటి వారు తమ పంతం నెగ్గించుకున్నారు. పటాన్ చెరులో ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు టికెట్ ఇచ్చినా.. దామోదర వర్గం రచ్చరచ్చ చేసింది. చివరకు తన పంతం నెగ్గించుకుని కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇప్పించుకుంది. అలాగే సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వక తప్పలేదు. ఇలా పలు చోట్ల రేవంత్ కు సీనియర్లు చుక్కలు చూపించారనే టాక్ వినిపిస్తోంది.