ఆ ఆరుగురు.. జగన్ శత్రువులు?

Chakravarthi Kalyan
వైఎస్‌ జగన్‌కు ఆరుగురు శత్రువులు ఉన్నారట. ఈ విషయాన్ని మంత్రి జోగి రమేశ్‌ చెప్పారు. ఆ ఆరుగురు ఎవరో కూడా చెప్పేశారు. వారు ఎవరంటే.. చంద్రబాబు, పవన్, లోకేష్, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు.. ఈ ఆరుగురు కలిసి జగన్‌ ను దింపేందుకు వ్యూహాలు పన్నుతున్నారట. అయితే వీరు ఎన్ని వ్యూహాలు పన్నినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు అన్నదమ్ముల ధాటికి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటున్నారు మంత్రి జోగి రమేశ్‌.


దేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులుంటే సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమేనంటున్న మంత్రి జోగి రమేశ్‌.. సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందని రుచి చూపించిన వ్యక్తి జగనన్న అంటున్నారు. 25 మంది మంత్రివర్గం ఉంటే అందులో 17 మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారని మంత్రి జోగి రమేశ్‌ గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: