అమెరికాతో ఇండియా కీలక ఒప్పందం?
అమెరికా నుంచి భారత్ 31MQ 9B డ్రోన్ల కొనుగోలు ఒప్పందం గురించి కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే సరైన సమయంలో డ్రోన్ల కొనుగోలుపై ప్రకటన ఉంటుంది. అమెరికా, భారత్ బంధం గతం కంటే బలంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆయన భారత్ తో చర్చించారు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదుల కార్యకలాపాలు పెరుగుతుండడంపైనా చర్చ జరిగింది. ఈ విషయంలో తమ ఆందోళనను భారత్ వ్యక్తం చేసింది. భారత్ ఆందోళనలను అమెరికా మంత్రులు అర్థం చేసుకున్నారు.