దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్!
మనలో అంతర్జ్యోతి వెలిగినప్పుడే జీవితం పట్ల స్పష్టత ఏర్పడి ప్రతి రోజు పండుగలా ఆవిష్కృతమవుతుందన్న సీఎం కేసీఆర్ .. మనం పయినించే ప్రగతి పథంలో అడుగడుగనా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలని.. ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.