
వివాదాస్పదం అవుతున్న కేటీఆర్ ఏడుపు కామెంట్స్?
అయితే.. రెండు ఎకరాలు ఉన్నవాడు.. పదెకరాలు ఉన్న వాడికి వచ్చే రైతుబంధు సొమ్ము చూసి ఏడుస్తున్నారని కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. వందల ఎకరాలు ఉన్నవారికి అప్పనంగా ప్రభుత్వ సొమ్ము రైతుబంధు పేరిట కట్టబెడుతూ.. మళ్లీ దాన్ని సమర్థించుకోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మాటల ద్వారా కేటీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శించారంటూ ఓ మహిళా జర్నలిస్టు చేసిన యూట్యూబ్ వీడియో వైరల్గా మారుతోంది.