తప్పుల తడకగా మల్లారెడ్డి నామినేషన్‌? రిజెక్ట్‌ తప్పదా?

Chakravarthi Kalyan
మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాల్లారెడ్డి ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని తెలుస్తోంది. మాల్లారెడ్డి సమర్పించిన అఫిడవిట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాంపల్లి దాయారా గ్రామ నివాసి, స్థానిక ఓటర్ కందాడి అంజిరెడ్డి కంప్లయింట్ ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మాల్లారెడ్డి సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న తప్పులపై అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లో మాల్లారెడ్డి ఎంపీగా పోటీ చేసిన సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో తన ఇంటర్ విద్యాభ్యాసం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాట్నిలో 1973 పూర్తి చేసినట్లు చెప్పారు.


అదే 2018లోమేడ్చల్ ఎమ్మెల్యే గా పోటీ చేసిన సమయంలోఇంటర్ విద్యాభ్యాసం వెస్లీ కాలేజ్, సికింద్రాబాద్ లో 1973లో పూర్తి చేసినట్లు ఉంది. ఇప్పుడు మాత్రం రాఘవ లక్ష్మి దేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973లో ఇంటర్ విద్య పూర్తి చేసినట్లు రాశారు. ఒకే సంవత్సరంలో మూడు కాలేజీల్లో చదివి ఇంటర్ ఎలా పూర్తి చేశారో అర్థం కావడం లేదని.. అఫిడవిట్లపై చర్యలు తీసుకోవాలని అంజిరెడ్డి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: