కెమికల్ డబ్బాలు సెల్లార్ లో ఉంచడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలంగాణా అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ వివరణ ఇచ్చింది. బజార్ ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఉదయం 9.34 గంటలకు ఫైర్ కాల్ వచ్చిందని...వెంటనే జూబ్లిహిల్స్, గౌలిగూడ, సాలర్జంగ్ మ్యూజియం, యకత్ పురా సహా మొత్తం 7 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఘటనాస్థలనాకి వెళ్ళే సరికి భవనం మొత్తం మంటలు వ్యాపించాయని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
భవనంలో చిక్కుకున్న 21 మందిని బయటకు తీసుకొచ్చామని వెల్లడించింది. వారిలో గాయాలపాలైన, అపస్మారక స్థితిలో ఉన్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ వివరించింది. కెమికల్ డబ్బాలు స్టోర్ చేసిన విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ ప్రమాదంలో 9 మంది మృతి చెందారని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది.