ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి జాతీయ అవార్డు గెలుచుకుంది. ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇ-క్రాప్ విధానం జాతీయ స్థాయిలో 2023 స్కోచ్ అవార్డు గెలుచుకుంది. జియో కో ఆర్డినేట్స్ ద్వారా సాగు భూమి, పంట వివరాలు నమోదు చేస్తున్నందుకు గానూ ఈ స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే పంట భీమా, పంట నష్ట పరిహారం, పెట్టుబడి రాయితీ , సున్నా వడ్డీ రుణాలు తదితర పథకాలను ఈ ఇ-క్రాప్ డేటా కేంద్రీకృత వేదికగా ఉపయోగపడుతోంది.
ఈ అవార్డు ఏపీకి దక్కడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇది అందరి విజయంగా వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సీ హరికిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై, వ్యవసాయంపై తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ అవార్డు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ తెలిపారు.