వరల్డ్‌కప్‌ ఫైనల్‌: ఆంధ్రా అసోసియేషన్‌ అదిరే ఏర్పాట్లు?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలను రేపు ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు భారీ స్క్రీన్ లను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తోందని కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఫ్యాన్ ఎరీనా పేరిట ఈ పెద్ద తెరలను ఏర్పాటు చేస్తున్నారు.
ఆ జాబితా ఇలా ఉంది.

1. విశాఖపట్నం: ఆర్కె బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా
2. అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్  (పి.టి.సి)
3. ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా
4. గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్
5. కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్
6. కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్
7. కర్నూల్: డి.ఎస్. ఏ. స్టేడియం
8. నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్
9. ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం
10. శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్
11. తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్
12. విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక
13. విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: