రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌పై కుట్ర జరిగిందా?
మాచారెడ్డి రైతు లింబయ్య సచివాలయం ముందు ఉరేసుకుని చనిపోతే కేసీఆర్ ఆదుకోలేదని.. కానీ కాంగ్రెస్ లక్ష రూపాయలు ఇచ్చి లింబయ్య కుటుంబానికి భరోసా ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడకు రాని కేసీఆర్...ఇవాళ సిగ్గులేకుండా ఓట్లు అడగడానికి వస్తుండని రేవంత్ రెడ్డి అన్నారు. 40 ఏళ్లుగా వివిధ పదవుల్లో ఉన్న కేసీఆర్ కు కొనాపూర్ గుర్తురాలేదని.. కానీ ఓట్ల కోసం కొనాపూర్ బిడ్డనంటూ ఇక్కడికి వస్తుండని రేవంత్ రెడ్డి అన్నారు.