స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు విముక్తి లభించినట్టేనా?
సునీత తప్పు చేసినట్లు కానీ...ఆమెపై చర్యలు తీసుకున్నట్లు కానీ సిఐడి ఎక్కడా చెప్పలేదని.. ముఖ్యమంత్రికి విశేష అధికారాలు లేవని కూడా సిఐడి వాదించలేదని.. నిధులు విడుదల చేయాలి అని ఆదేశించినంత మాత్రాన ఆధారాలు లేకుండా ఆ నిధులు పార్టీ ఖాతాకు మళ్లించారనడం సరికాదని హైకోర్టు పేర్కొంది. అంతే కాదు.. సబ్ కాంట్రాక్టర్ల తప్పిదాలు చేసి ఉంటే దానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యడు అవుతారన్న వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.