ఆ కులాలను బీసీ జాబితాలో కలపాల్సిందేనా?

Chakravarthi Kalyan
బీసీ జాబితా నుంచి తొలిగించిన 26 బీసీ కులాలను వెంటనే తిరిగి చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. తొలగించిన వెనుకబడిన 26 కులాలను 8 రోజలలోపు బీసీ జాబితాలో కలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఇప్పటికే విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో ఎంతో నష్టపోయారని ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తల్లితండ్రులు బీసీలుగా ఉంటె పిల్లలు ఓసీలు ఎలా అవుతారని అయన ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీలను విభజించి అధికారంలోకి వస్తామంటే బీసీలు ఊరుకోరని తరిమి తరిమి కొడుతారని ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.


తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరు ఏకమై బీసీ వ్యతరేక విధానాలకు పాల్పడే రాజకీయ పార్టీలకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయం నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bc

సంబంధిత వార్తలు: