మళ్లీ కేసీఆర్‌ వస్తే.. పేద విద్యార్థుల గతి అంతే?

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం కావలసిన పరిస్థితి వస్తుందని తెలంగాణ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శరణ్‌కుమార్‌, కార్యదర్శి ఉమా మహేశ్‌ అంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని తెలంగాణ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శరణ్‌కుమార్‌ అన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కేసీఆర్‌, కేటీఆర్‌ చేస్తున్న అన్యాయాలను ఆయన వివరించారు.


ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల ఫీజులు పెరుగుతున్నాయి కానీ....ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్‌ షిప్‌లు నేటికి పెంచలేదని తెలంగాణ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శరణ్‌కుమార్‌ మండిపడ్డారు. ఇంజనీరింగ్‌లో నేటికి పాత సిలబస్‌నే కొనసాగిస్తుండంతో చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని తెలంగాణ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శరణ్‌కుమార్‌ అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు కేసీఆర్‌, కేటీఆర్‌ కలిసిన న్యాయం జరగలేదని.. ఈ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాలు అందరూ బుద్ది చెప్పాలని తెలంగాణ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శరణ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: