
60 స్థానాల్లో తిరిగాం.. ఇవిగో సర్వే ఫలితాలు?
తెలంగాణ ప్రజలు ఓ పెద్ద మార్పు కోరుకుంటున్నారని ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ అన్నారు. అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేనిరీతిలో తెలంగాణలో మాత్రం ధన ప్రవాహం, డబ్బు పంపిణీ, ప్రలోభాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని యోగేంద్ర యాదవ్ అన్నారు. తెర వెనుక చేతులు కలిపి మళ్లీ ప్రజలను మోసగించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న భాజపా, భారాసకు ఓటు వేయవద్దని యోగేంద్ర యాదవ్ సూచించారు.