చివరి రోజుల్లో కేటీఆర్‌ వరాలు.. ఆటో డ్రైవర్లు కరుణిస్తారా?

Chakravarthi Kalyan
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆటో డ్రైవర్లకు రవాణా పన్ను రద్దు చేసింది. అంతే కాదు.. 5లక్షల బీమా సైతం కల్పించింది. ఆటోలకు ఫిట్‌నెస్ చార్జీలు రద్దు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినందుకు తెలంగాణ భవన్‌లో ఆటో సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. దీనికి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయిన రేవంత్‌ రెడ్డి అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు.

మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లకు రెండు పడకగదుల ఇల్లు లేదా గృహలక్ష్మి లబ్దిదారులుగా ఎంపిక చేసే బాధ్యత తనదేనని కేటీఆర్ ఆటో డ్రైవర్లుకు హమీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఓ భవనం కట్టిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. చివరి రోజుల్లో ఇచ్చే ఈ హామీలను వారు నమ్ముతారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: