మాజీ ఐఏఎస్‌ ఇంట్లో వందల కోట్లు.. అబద్దమేనా?

Chakravarthi Kalyan
ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో భారీగా డబ్బు, మద్యం దాచిపెట్టారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో అక్రమంగా డబ్బు నిల్వ చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం అధికారులు తనిఖీ చేశారు. జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్ 22లో ఉన్న ఏకే గోయల్ నివాసానికి శుక్రవారం సాయంత్రం 6గంటలకు వెళ్లారు. అధికారులు రాత్రి 12గంటల సమయంలో వెనుదిరిగారు. అయితే ఇంట్లో తనిఖీల సందర్భంగా ఏమీ బయటపడలేదని, ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు పూర్తిగా సహకరించినట్లు ఏకే గోయల్ అన్నారు.

తనను బద్నాం చేసిన కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అజారుద్దీన్, విజయారెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని ఏకే గోయల్ తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారని గోయల్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: