ఏపీ బీచ్‌శాండ్ అదానీ చేతికి చిక్కితే దేశానికే ముప్పు?
బీచ్ శాండ్ మినరల్స్ లో అణుధార్మిక శక్తికి సంబంధించిన ఖనిజాలుంటాయని.. బీచ్ శాండ్ మైనింగ్ ను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖలో రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ భద్రత అంశాన్ని అదానీకి తాకట్టు పెట్టేందుకు సిద్ధమవటం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ వాపోయారు.