తెలంగాణకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న వర్షాలు?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఇవాళ, రేపు తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి పొడి వాతవరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న తెలంగాణా రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి.
 

జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ జిల్లాలలో అక్కడక్కడ  భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మి. వేగంతో వీచాయి. ఇవాళ కూడా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మి. వేగంతో వీచే అవకాశం వుందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: