ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌.. ఆపరేషన్‌ చేయాల్సిందేనా?

frame ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌.. ఆపరేషన్‌ చేయాల్సిందేనా?

Chakravarthi Kalyan
మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో చేరారు. ఆయన నిన్న అర్థరాత్రి ఇంట్లో కాలు జారి పడటంతో గాయపడినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు చెబుతున్నారు. ఆయన్ను హుటాహుటిన సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే.. ఆయన ఎముక విరగడం వల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కోసం కావాల్సిన పరీక్షలను ప్రస్తుతం నిర్వహిస్తున్నామని.. పరీక్షల అనంతరం ఆపరేషన్ చేయాల్సి వస్తుందా.. లేదా అన్నది తేలుతుందని చెబుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ నుంచి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ను కొద్ది రోజులుగా పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి కలుస్తున్నారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: