వరాల జల్లు కురిపిస్తున్న ప్రధాని మోదీ?
రైతుల కోసం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు ఇస్తున్నారని.. పెర్టిలైజర్ బస్తా రెండు వేల విలు చేసేది రూ.266 కే రైతులకు అందిస్తున్నారని.. పిఎం విశ్వకర్మ పేరుతో చేతి వృత్తుల వారిని మోడీ ప్రోత్సహించారని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. పని ముట్లు కొనుగోలు చేయడానికి రెండు లక్షల రుణ సదుపాయం ఉందని.. కిసాన్ క్రెడిట్ కార్డు ... అందరూ తీసుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించారు. మోడీ మీ అందరికీ ఇచ్చే గ్యారంటీ ఇదన్న నిర్మలా సీతారామన్.. ఐదు శాతం వడ్డీ తో రుణాలు ఇస్తారని.. పోషణ్ అభియాన్ పేరుతో పోషకాలతో ఉత్పత్తులు ఇస్తున్నారని గుర్తు చేశారు.