లోక్సభలో దుండగులు.. అలర్టయిన తెలంగాణ?
ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించిన ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి.. ఇప్పటికే జారీ చేసిన పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసులను నిలిపివేయాలని సూచించారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు.. భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. ఏమాత్రం ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. ఈ మాత్రం జాగ్రత్త అవసరమే కదా.