రేవంత్ వార్నింగ్.. డ్రగ్స్‌పై నిఘా?
తమ వద్ద ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పూర్తి భద్రత,రక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని.. అతిపెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్స్ పై ప్రత్యేక దృష్టి పెడతామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి భరోసా ఇచ్చారు. అన్ని రకాల కేసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని.. ఇందుకు కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇకపై రెగ్యులర్ క్రైమ్స్ పైనా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.