ఆ ఆస్తుల లిస్టు తయారు చేయండి.. మంత్రిగారి ఆదేశం?
ప్రతి కార్పొరేషన్ సరికొత్త సాంకేతిక అందిపుచ్చుకుని సమర్థంగా పనిచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకుని సక్రమమైన పద్దతుల్లో అమలు పరిచేలా కార్పొరేషన్లు బాధ్యత తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ దిశగా ఇప్పటి వరకు కార్పొరేషన్లు చేసిన కృషి ఏంటో పూర్తి నివేదిక సమర్పించాలని ఆయా కార్పొరేషన్ల అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.