ఇవాళ ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్?
డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్.. హైదరాబాద్ బంజారా హిల్స్ నందినగర్ లోని నివాసంలో ఉంటారు. ఆ ఇంటిని కొన్నేళ్లుగా కార్యాలయ అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. ఇపుడు మళ్లీ నివాసానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేశారు. కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు సౌకర్యంగా ఇకపై నందినగర్ ఇంటిలోనే ఉండే అవకాశం ఉంది. ఫామ్ హౌస్ నగరానికి దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే వెంటనే వెళ్లడం ఇబ్బందిగా ఉన్నందున నందినగర్లోనే ఉండనున్నారు.