ఏపీలో కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారికి తెచ్చిన సంస్కరణకు రాష్ట్ర
కేబినెట్ అమోదాన్ని తెలియచేసింది. ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారం గా గ్రామ వార్డు సచివాలయల్లో ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు
క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
విజయవాడ రాయన పాడులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు భూమి కేటాయింపు చేస్తూ
ఏపీ కేబినెట్ ఆమోదించింది. అసైన్డ్ భూములకు
యాజమాన్య హక్కులు కల్పించేలా
జిల్లా కలెక్టర్ లకు అధికారాలు కల్పిస్తూ
ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయిస్తూ
ఏపీ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అకాల మరణం నేపథ్యంలో
ఏపీ కేబినెట్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. అలాగే ఆడుదాం ఆంధ్రాకు
ఏపీ కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. ఈ క్రీడల నిర్వహణ కు రూ. 127 వెచ్చించేదుకు
ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
డిసెంబర్ 26 తేదీన ఈ క్రీడలు ప్రారంభం అవుతాయి.