బాబు, లోకేశ్.. కుప్పం, మంగళగిరి మార్చేస్తారా?
పార్టీ గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్ల మార్పులు జరుగుతున్నాయని అంబటి రాంబాబు చెప్పారు. ఇప్పుడు 175 సీట్లు గెలవడమే తమ టార్గెట్ అని.. మా సంక్షేమ పథకాలు ఫలాలు ప్రజలకు చేరాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 60 శాతంపైగా ప్రజలు వైయస్ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌లో అరంగేట్రం చేశారని.. అసలు అసలు ఈసారి కుప్పంలో పోటీ చేస్తారా.. అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.