రేవంత్‌ గారూ.. ఉద్యోగమొద్దు..ఈ సాయం కావాలన్న నళిని?

Chakravarthi Kalyan
తెలంగాణ ఉద్యమం సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి చరిత్రలో నిలిచిన నళిని మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోం వద్దన్న మాజీ డీఎస్పీ నళిని.. నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని తెలిపారు. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని అన్నారు నళిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ ,సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తానని అన్నారు. ఆమె ఇప్పుడు వేదాచార్యురాలిగా ఉన్నారు.

నేను మిమ్మల్ని కలవాలని ఉన్నా.. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన 'వేదం యజ్ఞం' అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నందున కలవలేకపోతున్నానన్నారు. మహర్షి 200 వ జయంతి వరకు ఆ పుస్తకం సిద్ధం చేయాలని.. అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్ కు ఇచ్చేసి  వచ్చి మిమ్మల్ని కలుస్తానని మళిని ఫేస్‌బుక్‌లో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: