క్రిస్‌మస్‌ కానుకలు ఇస్తామంటున్న తెలంగాణ సర్కార్‌?

Chakravarthi Kalyan
క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొట్ట మొదటి పండుగ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగాలని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంపద ప్రజలకు పంచడంలో భాగంగా  పేద కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీ, విందును ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. 



క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. క్రిస్మస్ ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాలని భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిహెచ్ఎంసి పరిధిలోని  200 ప్రాంతాల్లో 500 మందికి, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి మందికి చొప్పున గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: