అమరావతి రైతుల ఉద్యమానికి నాలుగేళ్లు.. ఫలిస్తుందా?

Chakravarthi Kalyan
అమరావతిలో రైతుల ఉద్యమానికి ఇవాళ్టితో నాలుగేళ్లు నిండాయి. 2019 ఇదే రోజున అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారు. సీఎం జగన్ ప్రకటనను నిరసిస్తూ అమరావతి రైతులు, మహిళలు ఉద్యమం ప్రారంభించారు. నాలుగేళ్లుగా రాజధాని గ్రామాల్లో రైతు నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2019 లో రాజధాని 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు వెలిశాయి. ప్రతిరోజు ఆ దీక్షా శిబిరాలకు వచ్చి రాజధాని గ్రామాల రైతులు, మహిళలు కూర్చుంటున్నారు.

మొదట్లో కాస్త జోరుగా సాగిన ఈ ఉద్యమం ఆ తర్వాత పెద్దగా స్పందన కలిగించలేదు. జగన్ 3రాజధానుల ప్రకటనకు 4ఏళ్ళు  సందర్భంగా ఇవాళ రాజధాని రైతుల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా పట్టించుకునే వారు ఏరీ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: