ఆ పరిశ్రమలు హైదరాబాద్ నుంచి తరలిపోతాయా?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ చుట్టుపక్కల కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి అడిగారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో మధ్య, ప్రాచ్య, యూరోపియన్ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇలాంటి పరిశ్రమలు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: