బాబు, పవన్ చర్చలు.. ఆ ప్యాకేజీ కోసమేనా?

Chakravarthi Kalyan
చంద్రబాబుకు పవన్‌కళ్యాణ్‌కు మధ్య సంబంధాలన్నీ ప్యాకేజీతో ముడిపడినవేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వారు ఇద్దరూ కలిసినప్పుడల్లా చర్చ పవన్‌కళ్యాణ్‌కు టీడీపీ నుంచి ఎంత ప్యాకేజీ అందించాలనే అంశంపైనే అనేది వాస్తవం అంటున్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి ర‌విచంద్రారెడ్డి. పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి రాజకీయాల్లో ప్యాకేజీ కోసమే పనిచేస్తున్నాడని అంటున్నామని.. నూటికి నూరుపాళ్లూ ఆయన్ను ప్యాకేజీస్టార్‌ అనడంలో తప్పేమీలేదని స్పష్టం చేస్తున్నామని కనుమూరి ర‌విచంద్రారెడ్డి తెలిపారు.

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను మేము ప్యాకేజీ స్టార్‌ అన్నప్పడల్లా ఆయన ఉలికులికిపడుతూ ఎగిరెగిరిపడుతుంటాడన్న కనుమూరి ర‌విచంద్రారెడ్డి.. ఇటీవల చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ దత్తపుత్రునికి సరిపోవడంలేదనే విషయంపై కొంత చర్చ జరుగుతోందన్నారు. అందుకే చంద్రబాబు కొడుకు లోకేశ్‌ తలపెట్టిన యువగళం ముగింపు సభకు మొదట పవన్‌కళ్యాణ్‌ హాజరుకావడంలేదన్నాడని.. అందుకే నేరుగా చంద్రబాబు రాయబారానికి సిద్ధపడ్డాడని తెలిపారు. అందుకే చంద్రబాబు హైదరాబాద్‌లో పవన్‌ ఇంటికి ఆయన వెళ్లి మాట్లాడి బుజ్జగించారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: