కాంగ్రెస్‌ శ్వేతపత్రంపై కేటీఆర్‌ షాకింగ్‌ కామెంట్‌?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేత పత్రంపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.  ఇది శ్వేతపత్రం కాదు, ప్రచార యంత్రం ద్వారా నడిచే పూర్తి అబద్ధాలు, తప్పుడు సమాచారంతో నిండిన పత్రం అంటూ మాజీ మంత్రి కేటీఆర్ వర్ణించారు. అత్యంత విజయవంతమైన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రయత్నించడం  సిగ్గుచేటని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.



మీ ఎజెండాకు అనుగుణంగా రాజకీయాలతో ఆర్థిక అంశాలను ముడిపెట్టి అయోమయానికి గురిచేసే ప్రయత్నం మీ వంచనను కప్పిపుచ్చుకోదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మీరు చెబుతున్నట్లుగా రాష్ట్రం కష్టాల్లో ఉంటే, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐ లో కొత్త క్యాంపు కార్యాలయానికి ఎందుకు డబ్బు వృధా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.న్యూదిల్లీలో తెలంగాణ భవన్‌ ఎందుకు నిర్మించాలనుకుంటున్నారని.. వంద రోజుల్లో ఆరు హామీల అమలుకు ఎందుకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. 100 రోజుల నోటీసుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని కేటీఆర్‌ గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KTR

సంబంధిత వార్తలు: