పవన్, బాలయ్య కలిస్తే.. విజృంభణ విశ్వరూపమేనా?
నూతిలో కప్పలా, తాడేపల్లి ప్యాలెస్ తన సర్వస్వం అని జగన్ అనుకుంటున్నాడన్న నందమూరి బాలకృష్ణ.. వైకాపా అక్రమాలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాటం అభినందనీయమని నందమూరి బాలకృష్ణ మెచ్చుకున్నారు.
ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవం పెంచితే, చంద్రబాబు తెలుగు ప్రజల్లో విశ్వాసం పెంచారని నందమూరి బాలకృష్ణ అన్నారు. నవశకం సభలో ఒకే వేదికపై చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేశ్ ఆసీనులైన దృశ్యాలు చూసి టీడీపీ ఫ్యాన్స్ ఆనందపడిపోయారు.