నారా లోకేశ్‌కు వైఎస్ఆర్
తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్
షర్మిల గ్రీటింగ్స్ పంపారు.. క్రిస్మస్ సందర్భంగా నారా లోకేశ్‌కు వైఎస్
షర్మిల ఓ కానుక పంపారు. అది ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. వైఎస్
షర్మిల లోకేశ్‌కు
క్రిస్మస్ కానుక పంపినట్టు నారా లోకేశే స్వయంగా సోషల్
మీడియా ద్వారా తెలిపారు. తనకు
షర్మిల గ్రీటింగ్స్ పంపారని తెలుపుతూ.. షర్మిలకు కృతజ్ఞతలు తెలుపుతూ
నారా లోకేష్ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టు రాజకీయంగా కలకలం రేపుతోంది. తమ కుటుంబం తరఫున షర్మిలకు లోకేశ్ కూడా
క్రిస్మస్, కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు.
అయితే గతంలో ఎన్నో క్రిస్మస్లు వచ్చాయి. కానీ..
షర్మిల గతంలో ఇలా
నారా లోకేశ్ కానీ..
టీడీపీ నేతలకు కానీ.. గ్రీటింగ్స్ పంపలేదు.. ఒకవేళ పంపినా ఆ విషయం వెలుగులోకి రాలేదు. ఓవైపు అన్నతో సఖ్యత లేకపోవడం.. మరోవైపు వైటీపీకి తెలంగాణలో బజ్ లేకపోవడంతో ఆమె
టీడీపీ వైపు చూస్తుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.