జగన్ ఏదో చేస్తాడనుకున్నా.. పృథ్వీరాజ్ కామెంట్స్‌?

Chakravarthi Kalyan
శ్రీ సత్య సాయి జిల్లా జిల్లాలో పర్యటించిన సినీ నటుడు పృథ్వీరాజ్.. వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి జగన్‌కు 151 సీట్లు ఇచ్చారు అద్భుతం చేస్తాడనుకుంట ఏమీ చేయలేదని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పే పరిస్థితుల్లో మంత్రులు లేరని.. అసెంబ్లీలో మంత్రులు అశ్లీల పదాలు వాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడేలా చేస్తున్నారని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు.


చంద్రబాబు నాయుడు ను తిడితే మంత్రి పోస్ట్ వస్తుందని కొందరు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏదీ లేదని.. పర్యావరణాన్ని రక్షించే రుషికొండను కూడా దోచుకున్నారని సినీ నటుడు పృథ్వీరాజ్ కామెంట్ చేశారు. మంత్రుల కంటే వైసీపీలో సలహాదారుల పాత్ర ఎక్కువ అని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: