సంక్రాంతి సినిమాల రిలీజుల వివాదంపై ప్రముఖ
నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఫిల్మ్ చాంబర్ లో ఆ ఐదు చిత్రాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు
నిర్మాత దిల్ రాజుతెలిపారు. గుంటూరు కారం నిర్మాతలు మినహా మిగతా నలుగురు నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికి లాభదాయకంగా ఉంటుందని దిల్ రాజు సూచించారు.
సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే చిత్ర నిర్మాతకు ఎలాంటి పోటీ లేకుండా సోలో తేదీ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని
నిర్మాత దిల్ రాజు ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ కాదు.. కూడదని.. సంక్రాంతికి ఐదు చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకు సరైన న్యాయం జరగదని
నిర్మాత దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అంతే కాదు..
సినిమా విడుదల తేదీలపై చిత్ర
పరిశ్రమ ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదని
నిర్మాత దిల్ రాజు గుర్తు చేశారు.
తెలుగు సినీ
పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు తెలిపారు. ఇటీవలే సినిమాటోగ్రఫి
మంత్రి కోమటిరెడ్డి
వెంకట్ రెడ్డిని కలిశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు
నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.