
కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు?
తీసుకుంటోంది. ఈ మేరకు ఏఐసీసీ మానిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి తెలంగాణకు వచ్చారు. ప్రజల నుంచి ప్రత్యేకంగా అభిప్రాయాలు, సలహాలు తీసుకుంటున్నామన్న ఏఐసీసీ మానిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి.. 2024లో అధికారంలోకి తీసుకురావడానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నామన్నారు.
మైనారిటీ, ఓబీసీ, ట్రాన్స్ జెండర్స్ సహా అనేక వర్గాలతో సమావేశం జరిగిందన్న ఏఐసీసీ మానిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి.. అన్ని వర్గాల నుంచి కీలక అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలో కూడా అనేక వర్గాలను కలిశామని.. ప్రజల అభీష్టం నెరవేరేలా మేనిఫెస్టో ఉంటుందని.. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నామని ఏఐసీసీ మానిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు.